Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వ్యాయామంతో ఫ్లూ టీకాల ప్రభావం పెరుగుతుంది

అనేక రోగాల నియంత్రణకు మనం ముందుగానే టీకాలు తీసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిలో ఫ్లూ నివారణకు తీసుకునే టీకా కూడా ఒకటి. దుష్ప్రభావాలు ఉంటాయనే భయంతో కొందరు ఈ ఫ్లూ టీకా తీసుకోవడానికి వెనుకాడుతుంటారు కూడా. అయితే.. అలాంటి భయాలు అక్కర్లేదంటున్న శాస్త్రవేత్తలు, అసలు టీకా మరింత మెరుగ్గా పనిచేయగల మార్గాన్ని తమ తాజా అధ్యయనాల్ని బట్టి సూచిస్తున్నారు.

ఫ్లూ టీకా తీసుకునే ముందు లేదా, తీసుకున్న తర్వాత వ్యాయామం చేయడం వలన సత్ఫలితాలు ఉంటాయని సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం చెబుతోంది. ఫ్లూ టీకాకు వ్యాయామానికి విడదీయలేని సంబంధం ఉందని అధ్యయనం నిర్వహించిన కేట్‌ ఎడ్వర్డ్స్‌ చెప్పారు. సహజంగానే ఎలుకల పై చేసిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

More Telugu News